సునీత విలియమ్స్(Sunitha) సహా వ్యోమగాములు భూమికి చేరిన సందర్భంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. వారిని తీసుకొచ్చిన క్యాప్సూల్ ఫ్లోరిడా సాగర జలాల్లో దిగగా.. ఆ సమయంలో డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. క్యాప్సూల్ చుట్టూ చేరిన డాల్ఫిన్లు(Dolphins) పైకి ఎగురుతూ నీటిలో కనిపిస్తూ చేశాయి. ఆ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవైపు సముద్ర జీవులు చుట్టూ చేరి తిరుగుతుంటే మరోవైపు ఆ క్యాప్సూల్ ను తరలించేందుకు నాసా బృందం ఏర్పాట్లు చేసింది. 9 నెలలు అంతరిక్షంలో పరిశోధనలు చేసిన వ్యోమగాములకు ఇలా డాల్ఫిన్లు అపూర్వ స్వాగతం పలికాయని భావిస్తున్నారు.