భారత్-పాక్(India-Pak) యుద్ధ వివాదంలో ట్రంప్ తీరుపై అమెరికా నిపుణుడు సంచలన విషయాలు వెల్లడించారు. సంక్షోభ పరిష్కారంలో ఘనత దక్కకపోవడంతో ట్రంప్ అవమానంగా ఫీలయ్యారని US వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులడు ఆష్లే జె.టెలిస్ అన్నారు. ఆయన ఆశించినట్లు పాక్ తో శాంతికి భారత్ తిరస్కరించడంతోనే ఢిల్లీ-వాషింగ్టన్ సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. రెండు దేశాలకు శాంతిని తేవడంలో తగిన పాత్ర పోషించలేదన్న అసంతృప్తితోనే 50% సుంకాలు విధించారన్నారు. రష్యా చమురును 2024లో చైనా 62.6 బి.డా., భారత్ 52.7 బి.డా. మేర కొన్నాయని.. అయినా జిన్ పింగ్ ను వదిలేసి మోదీ సర్కారుపైనే పడ్డారన్నారు. భారత్-అమెరికా బంధాన్ని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో దెబ్బతీశారన్నారు.