అక్రమ వలసదారుల్ని(Illegal Immigrants) బంధించి మరీ తమ సొంత విమానాలతో దేశం దాటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. US పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంలో భాగంగా అమెరికన్ పౌరులకు ఆదాయ పన్ను(Income Tax)ను రద్దు చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఇన్ కమ్(కనీస అవసరాలు, EMIలకు ఖర్చు చేశాక మిగిలినవి) పెంచేలా చూస్తున్నారు. 1870-1913 మధ్యకాలంలో ప్రత్యేక టారిఫ్ ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయంపై అమెరికా ఆధారపడింది. ఆ టారిఫ్ ద్వారా అమెరికన్లు శక్తిమంతులుగా తయారవగా.. తర్వాత వాటిని క్రమంగా తొలగించారు.
అమెరికన్లను మరింత ధనవంతులుగా మార్చే ప్రయత్నంలో భాగంగా సుంకాల ఆధారిత వ్యవస్థను తీసుకురాబోతున్నారు. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక పన్నులు విధించడం ద్వారా ఆదాయం రాబట్టనుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ఎక్స్ టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే సంస్థను ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ల కుటుంబాలకు ప్రాధాన్యత దక్కబోతున్నది.