వస్తువులు అందించే ఈ-కామర్స్(e-commerce) సంస్థలు.. ఉగ్రవాదులకు సైతం రవాణా కేంద్రాలుగా మారాయి. ఉగ్రవాదులకు నిధుల్ని పంపేందుకూ వాడుకుంటున్నారని FATF(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) గుర్తించింది. 2019లో పుల్వామా దాడిలో CRPF జవాన్లు మృత్యువాతపడ్డ ఘటన వెనుకా అదే జరిగింది. అమెజాన్ లో కెమికల్ కు ఆర్డర్ పెట్టిన జైషే మహ్మద్ సంస్థ.. దాని ద్వారా RDX తయారు చేసి పుల్వామా దాడికి పాల్పడింది. 2022లో యూపీలోని గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి ఘటనలో ఇస్లామిక్ స్టేట్ సంస్థకు పే పల్(PayPal) ద్వారా నిధులు బదిలీ అయ్యాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే దేశాలకు చెక్ పెట్టే FATF.. ఈ-కామర్స్ సంస్థలపై దృష్టిపెట్టాలని అన్ని దేశాలకు సూచించింది.