భూకంపంతో మయన్మార్ లో 694 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరో 1,670 గాయపడ్డారని, ప్రపంచ దేశాలు సహాయాన్ని అందించాలని మయన్మార్ అధినేత మిన్ ఆంగ్ లెయింగ్(Min Aung Hlaing) కోరారు. మృతుల సంఖ్య వేలల్లో ఉండొచ్చని అమెరికా సహా వివిధ దేశాలు అంటున్నాయి. వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వాటి కింద ఎంత మంది ఉన్నారనేది లెక్కల్లోకి రావడం లేదు. పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపడితే గానీ మృతుల సంఖ్య తెలిసేలా లేదు.