మరోసారి భారీ భూకంపం(Earth Quake) రావడంతో తైవాన్ ప్రజలు భయంతో పరుగులు తీశారు. దేశ తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంపం ధాటికి రాజధాని(Capital City) తైపీలో భవనాలు బీటలు వారాయి.
భూకంప కేంద్రం 9.7 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భవనాలన్నీ ఊగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో జనమంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏప్రిల్లో 7.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోయారు.