ఇప్పటికే భూకంపంతో మయన్మార్, థాయిలాండ్ అల్లకల్లోలమైతే.. ఇప్పుడు మరో దేశం వణికిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా(Tonga)లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. పాంగాయ్(Pangai) గ్రామ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియాలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. పెద్ద సునామీ రాబోతుండగా అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు లోతట్టు ప్రాంతాలు, బీచ్ ల్లో ఉండకుండా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని టోంగా సర్కారు హెచ్చరించింది. 171 దీవుల్లో టోంగా ఒకటైతే లక్ష మంది జనాభా ఉండగా, అక్కడ భూకంపాలు సర్వసాధారణం.