అమెరికాలో భారీ భూకంపం(earth quake) సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైనట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. అలస్కా ద్వీపకల్పంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది. విపత్తు తీవ్రత భారీగానే ఉందని.. అలస్కా, కొడియాక్ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల్ని జారీచేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సేఫ్ ప్లేస్ కు తరలించగా… తిరిగి ఆ హెచ్చరికల్ని ఉపసంహరించుకున్నారు. మరోవైపు అక్కడి అగ్నిపర్వతం కూడా బద్ధలయ్యే ప్రమాదం ఉందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని స్థానికులకు తెలియజేసింది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే అఫీషియల్స్ పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది.