రష్యాలో గత వారం 8.8 తీవ్రతతో భూకంపం వచ్చాక సునామీ అల్లకల్లోలం సృష్టించింది. కమ్చట్కా(Kamchatka)లో ఈ భూకంపం రావడానికి ప్రధాన కారణం.. అగ్ని పర్వతం పేలుడేనని గుర్తించారు. 600 ఏళ్ల తర్వాత క్రషెనిన్నికోవ్ అగ్ని పర్వతం పేలిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారని రష్యా RIA న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పర్వతం క్రితం సారి 1463లో పేలి లావా ఎగిసిపడింది. ఈసారి పేలుడు తీవ్రతకు బూడిద 6 వేల మీటర్లు(3.7 మైళ్లు) ఎగిరిపడినట్లు రికార్డయింది. గత వారపు భూకంపం రష్యా, జపాన్, అమెరికా సహా 30 దేశాలకు విస్తరించి ఆగమాగం చేసింది.