అమెరికా(United States)లో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. బర్డ్ ఫ్లూ(Bird Flu) వల్ల కోట్లాది కోళ్ల మృతితో రేట్లకు రెక్కలొచ్చాయి. పెన్సిల్వేనియాలోని గ్రీన్ క్యాస్టిల్ ప్రాంతంలో లక్ష గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ 40 వేల డాలర్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో గుడ్డు ధర రెండున్నర డాలర్లు(రూ.212)గా ఉంది. దీనిపై అక్కడ పెద్దయెత్తున దర్యాప్తు చేస్తున్నారు. ఇక అమెరికాలో చాలా రాష్ట్రాల్లోని రెస్టరెంట్లలో గుడ్లకు కొరత ఏర్పడింది. మిడ్ వెస్ట్ ప్రాంతంలో డజను గుడ్లు హోల్ సేల్ గా 7.08 డాలర్లు(రూ.600) పలుకుతున్నాయి. ఈ రెండేళ్లలోనే రేట్లు ఏడింతలు పెరిగినట్లు US వ్యవసాయశాఖ అంటున్నది. 2022 నుంచి వ్యాధి మొదలయ్యాక 10 కోట్ల 40 లక్షల గుడ్ల కోళ్లు మృతిచెందితే, 2024 అక్టోబరు నుంచే 2 కోట్ల 90 లక్షలు మృత్యువాత పడ్డాయి. ఇక న్యూయార్క్ లో డజను 11.99 డాలర్లు(రూ.1019)గా ఉంది. ఈ లెక్కన ఒక్కోటి రూ.85 పలుకుతోంది.