
పాకిస్థాన్ కు ప్రమాదం ఏర్పడితే అణ్వస్త్రాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై అమెరికా మాజీ అధికారి మండిపడ్డారు. ఆయన US గడ్డ పైనుంచే ఇలా మాట్లాడటంతో.. దేనికైనా వెనుకాడబోమంటూ భారత్ దీటుగా స్పందించింది. అయితే మునీర్ పై అమెరికా మాజీ ఉన్నతాధికారి మైఖేల్ రూబిన్(Michael Rubin) ఫైర్ అయ్యారు. చెత్త దేశం ఎలా మాట్లాడుతుందో పాక్ చీఫ్ మాటలు అలా ఉన్నాయన్నారు. ‘ఆసిమ్ మునీర్ సూట్ లో ఉన్న ఒసామా బిన్ లాడెన్’ అంటూ రూబిన్ విరుచుకుపడ్డారు.