అమెరికా గ్రీన్ కార్డుల(Green Cards) ఆలస్యంతో కార్పొరేట్లకు దెబ్బ తగులుతోంది. శాశ్వత నివాసం కోసం జరుగుతున్న జాప్యంతో సీనియర్ నిపుణులు సైతం అక్కడ ఉండలేకపోతున్నారు. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా ఉన్నత స్థానాల్లో కొనసాగట్లేదు. మెట్రోపాలిటన్ అట్లాంటా రాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ(MARTA) సీఈవో కోలీ గ్రీన్ వుడ్.. జులై 17న రిటైరయ్యారు. ఇందుకు కారణం ఆయనకు గ్రీన్ కార్డు రాకపోవడమే. కెనడా జాతీయుడైన వుడ్.. కార్డు లేక ముందుగా రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఉపాధి అధికార పత్రం(EAD) గడువు 2025 జులై 18న ముగిసింది. పర్మిట్ గడువు ముగిశాక ఇక ఎలాగూ గ్రీన్ కార్డు దొరకదనే ఆలోచనతో ఆయన దేశం వెళ్లిపోతున్నారు. చాలామంది భారతీయులదీ ఇదే కథ.