మరికొన్ని గంటల్లోనే పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden).. వెళ్తూ వెళ్తూనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు ట్రంప్ ప్రతీకారంతో రగిలిపోతుంటే, ఆయనకు భిన్నంగా బైడెన్ నిర్ణయాలున్నాయి. తనకున్న ప్రత్యేక అధికారాలతో పలువురికి క్షమాభిక్షలు ప్రసాదించడం అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె వంటి ఉన్నతస్థాయి వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ టేబుల్ పై లెటర్ ఉంచారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై దాడులు జరగ్గా, ఆ కేసులోనూ క్షమాభిక్ష పెట్టారు.
శ్వేతసౌధాన్ని(White House)ను బెడైన్ ఖాళీ చేయాల్సి ఉండగా, ఐదు గంటల్లోనే ట్రంప్ వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దిగిపోయే అధ్యక్షుడు కొత్త ప్రెసిడెంట్ రాకను ఆహ్వానిస్తూ గతంలో జరిగిన తప్పొప్పులు, నిర్ణయాల వంటి వాటిని లెటర్లో ప్రస్తావిస్తారు. కానీ గతంలో డొనాల్డ్ ట్రంప్ తాను పదవి నుంచి దిగిపోయే సమయంలో బైడెన్ కు ఇలాంటి సంప్రదాయాన్ని అనుసరించలేదు. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని, ప్రతీకార చర్యలు జోరుగా జరిగే అవకాశముందన్న వార్తల నడుమ.. జో బైడెన్ పలువురికి క్షమాభిక్ష ప్రసాదించడం సంచలనంగా మారింది.