ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో పెను విషాదం సంభవించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఈ దుర్ఘటనలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బెయిలీ రోడ్ లోని ప్రముఖ బిర్యానీ(Biryani) రెస్టరెంట్(Restaurent)లో మంటలు అంటుకుని ఏడో ఫ్లోర్ వరకు వ్యాపించాయి. దీంతో ఎటూ పారిపోయే పరిస్థితి లేక చాలా మంది అందులోనే చిక్కుకున్నారు.
బెయిలీ రోడ్ లోనే ఈ రెస్టరెంట్ గల బిల్డింగ్ లోనే వస్త్ర దుకాణాలు(Cloth Shops), మొబైల్ షాపులు ఉన్నాయి. 43 మంది చనిపోతే మరో 40 మందికి గాయాలైనట్లు బంగ్లా వైద్యశాఖ మంత్రి సమంత లాల్ సేన్ ప్రకటించారు. తీవ్ర గాయాల పాలైన వారితో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బంగ్లాదేశ్ లో సరైన నిబంధనలు అమలు చేయకపోవడం వల్ల తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
2021 జులైలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలోని అగ్ని ప్రమాదం జరిగి 52 మంది మృత్యువాత పడ్డారు. అటు 2019 ఫిబ్రవరిలో ఓ అపార్ట్ మెంట్ లో చోటుచేసుకున్న ఫైర్ ఇన్సిడెంట్ లో 70 మంది ప్రాణాలు విడిచారు. గ్యాస్ స్టౌ పేలడం వల్లే ఘోరం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.