డొనాల్డ్ ట్రంప్ పై దాడికి పాల్పడ్డ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పెన్సిల్వేనియా(Pennysilvania)లోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. ట్రంప్ చెవి(Ear)కి గాయం కాగా.. ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు స్పందించారు. ఈ ఘటనలో దుండగుడితోపాటు ఒక సాధారణ వ్యక్తి మరణించారు.
గతంలోనూ…
అమెరికా చరిత్రలో గతంలోనూ దాడులు జరిగిన సందర్భాలున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు. 1963లో తన వాహనశ్రేణి(Motorcade)లో వెళ్తుండగా అప్పటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీపై దాడి(Assasinated) జరిగింది. ఆ తర్వాత 1968లో కెనెడీ సోదరుడైన బాబీ కెనెడీ దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక 1981లో నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరగ్గా ఆయన తృటిలో తప్పించుకున్నారు.