రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… ఫ్రాన్స్(France) చేరుకున్నారు. పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎలిజబెత్ బార్న్ స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన(Tour) చేపడుతున్నారు. తొలుత అక్కడి ప్రైమ్ మినిస్టర్ తో భేటీ కానున్న మోదీ… అనంతరం సెనెట్ సందర్శించి దాని అధ్యక్షుడు గెరాడ్ లార్చర్ తో మీట్ అవుతారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రవాస భారతీయులతో మాట్లాడతారు.
ప్రవాస భారతీయులతో ప్రోగ్రాం పూర్తయిన తర్వాత మోదీ… ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ను కలుసుకుంటారు. విందులో పాల్గొన్న అనంతరం ఆ దేశ నేషనల్ డే సెలబ్రేషన్స్ కు అటెండ్ అవుతారు. పారిస్ లో శుక్రవారం జరిగే నేషనల్ డే వేడుకలకు భారత త్రివిధ దళాలు హాజరవుతున్నాయి.