
ప్రధానమంత్రి(prime minister) నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడికి ప్రత్యేక బహుమతి అందజేశారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అందుకున్న అనంతరం మోదీ.. అక్కడి ప్రెసిడెంట్ కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని అందించారు. దక్షిణ భారతదేశంలో వందల సంవత్సరాలుగా ప్రాచుర్యం పొందుతున్న ఈ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్ ను.. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కు అందించడం గర్వకారణంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. ఆయన సతీమణి బ్రిగెట్టె మేక్రాన్ కు తెలంగాణ పోచంపల్లిలో ప్రత్యేకంగా తయారు చేసిన చీరను బహూకరించారు. పోచంపల్లి చేనేత కార్మికులు తయారు చేసిన సిల్క్ ఇక్కత్ చీర.. దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది.
రెండు రోజుల టూర్ లో భాగంగా ఫ్రాన్స్ బాస్టిల్ డేలో ప్రధాని పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్ మేక్రాన్ తో భేటీ అయి ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన పూర్తయింది.