భారత వాయుసేన(IAF) దాడులతో ఆర్థికంగానే కాదు.. చమురు పరంగానూ సంక్షోభంలో పడింది పాకిస్థాన్. రాజధాని ఇస్లామాబాద్ లో 48 గంటలు బంకులు(Fuel Bunks) మూసేసింది. దేశవ్యాప్తంగా ఇంధన కొరతతో దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. పెట్రోలు, డీజిల్ పై రేషన్ విధానాన్ని పాటిస్తోంది. నిస్సహాయతలో పడ్డ శత్రు దేశం.. అమెరికా మధ్యవర్తిత్వం కోసం వెంపర్లాడుతోంది. డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడేందుకు యత్నిస్తోంది ఇస్లామాబాద్ నాయకత్వం. ఈ విషయంలో జోక్యం చేసుకునేది లేదని ఇప్పటికే US ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. ఆయన భారత పర్యటనలో ఉన్నప్పుడే పహల్గామ్ దాడి జరిగింది. ఉద్రిక్తతల్ని అమెరికా పెద్దగా పట్టించుకోకపోవడంతో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది పాక్ పరిస్థితి. అయితే అణుబాంబు వేస్తామని బెదిరించడంపై గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.