ఏడాదిన్నర ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 50 వేల మంది మరణించారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్ జరిపిన మిలిటరీ దాడుల్లో భారీ నష్టం జరిగిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, మొత్తం సంఖ్య 50,021కి చేరింది. ఇందులో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. రెండు నెలల కాల్పుల విరమణ అనంతరం గత వారమే మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఏడాదిన్నర క్రితం ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిలో 1,200 మంది చనిపోగా, 251 మంది బందీలుగా మిగిలారు. బందీల విడుదల విషయంలో హమాస్ నిర్లక్ష్యం చేయడంతో ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది.