అమెరికా ఈశాన్య(Northeast) ప్రాంత రాష్ట్రాల్లో వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ(New Jersey), పెన్సిల్వేనియాల్లో అడుగు తీసే పరిస్థితి లేదు. సబ్ వేలు మూసుకుపోయి, కార్లు కొట్టుకుపోయి వాతావరణం భీతావహంగా తయారైంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దంటూ న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ఎమర్జెన్సీ ప్రకటించారు. వరదలున్న నగరాల్లో ప్రజారవాణా ఆగిపోయింది. పెన్సిల్వేనియాలో ఐదు గంటలపాటు కురిసిన వానతో 17.8 సెంటీమీటర్లు నమోదైంది. వెస్ట్ చెస్టన్ కౌంటీలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com