ప్రపంచంలోనే ఏకైక హిందూదేశం, 8 వేల మీటర్ల కన్నా ఎత్తైన 10 శిఖరాల్లో 8 ఉండటం నేపాల్ ప్రత్యేకతలు. హిమాలయాల్లోని ఆ చిన్న దేశం.. అల్లర్లతో అగ్నిగుండమైంది. 20 శాతమే వ్యవసాయ భూములతో అత్యంత పేద దేశంగా ఉంది. నార(Jute), చక్కెర, పొగాకు పంటలకే పారిశ్రామికీకరణ పరిమితమైంది. ఆర్థిక వ్యవస్థ బలపడక.. విద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలు అస్తవ్యస్థమయ్యాయి. భారత్, చైనా ఇచ్చే అప్పులే ఆధారం కాగా, 2015 భూకంపంతో నేపాలీలు కోలుకోలేదు. సోషల్ మీడియా నిషేధం మాటున ఆగ్రహజ్వాలలు చెలరేగినా.. లోలోపల దాగి ఉన్న ఆక్రోషం నివురుగప్పిన నిప్పులా బయటపడింది. దీంతో విదేశాంగ, ఆర్థిక మంత్రుల్ని సైతం వీధుల్లో ఉరికించి కొట్టారు.