
హిందూజా గ్రూప్ అధినేత సంజయ్ హిందూజా వివాహ వేడుకకు రూ.150 కోట్లు వెచ్చించారు. ఆయన పెళ్లి 2015లో జరిగింది. డిజైనర్ అనుసూయ మహతానీని ఉదయపూర్ లోని జగ్ మందిర్ ఐలాండ్ ప్యాలెస్ లో వివాహమాడారు. 3 రోజుల పాటు సాగిన వేడుకలకు 16 వేల మంది అతిథులు రాగా, జెన్నిఫర్ లోపెజ్, నికోల్ షెర్జింగర్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ప్రదర్శనలు ఇచ్చారు. ముంబైలో రెండు చోట్ల భారీ పార్టీలు ఇచ్చారు.
తాజ్ ప్యాలెస్ లో ఇచ్చిన విందుకు 3,000 మంది హాజరయ్యారు. మాధురి దీక్షిత్, అనిల్ కపూర్, రిషికపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు షోలు ఇచ్చారు. ఈ భారత-బ్రిటిష్ బిలియనీర్.. గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తోపాటు రియల్ ఎస్టేట్ వెంచర్స్ ను పర్యవేక్షిస్తున్నారు. ఈయన తండ్రి గోపిచంద్ పి.హిందూజ ఈ మధ్యే కన్నుమూశారు.