ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu), రక్షణ(Defence) శాఖ మాజీ మంత్రి యోవ్ గ్యాలెంట్ తోపాటు హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డెయీఫ్ అరెస్టుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్లు జారీచేసింది. అమాయకుల ప్రాణాలు తీస్తూ యుద్ధ నేరాలకు పాల్పడ్డ ఈ ముగ్గుర్నీ అరెస్టు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. 2023 అక్టోబరు 8 నుంచి 2024 మే 20 వరకు మానవ హననానికి పాల్పడ్డారని ముగ్గురు జడ్జిల ప్యానెల్ గల కోర్టు నిర్ధారించింది. సామాన్య పౌరులపై కనికరం లేకుండా తమ యుద్ధ కాంక్ష కోసం నీరు, ఆహారం, మెడికల్ సౌకర్యాలు కల్పించకుండా దారుణాలకు పాల్పడ్డారని అభిప్రాయపడింది.
హమాస్ మిలిటరీ చీఫ్ కూడా అదే తీరుగా వ్యవహరించారని మండిపడింది. దీన్ని నెతన్యాహు ఖండిస్తూ ICCది తప్పుడు నిర్ణయమని కొట్టిపారేశారు. గతంలోనూ ఇదే కోర్టు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ICCలో ఇజ్రాయెల్ కు సభ్యత్వం లేకపోగా, సభ్య దేశాల సహకారంపైనే న్యాయస్థానం ఆదేశాలు ఆధారపడి ఉంటాయి. దీన్నిబట్టి నెతన్యాహు ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు మాత్రమే అరెస్టుకు అవకాశం ఉంటుంది.