లీటర్ పాల రేటు ఎంతుంటుంది.. రూ.60 నుంచి పెద్ద పెద్ద నగరాల్లో అయితే గరిష్ఠంగా రూ.100 దాకా ఉంటుంది. కానీ ఆ దేశంలో రూ.370 పెడితే తప్ప లీటర్ పాలు దొరకడం లేదు. మెల్ బోర్న్, పారిస్, ఆమ్స్టర్ డ్యామ్ వంటి మహానగరాల ధరల్ని మించాయి అక్కడి సర్కారు స్పెషల్ ట్యాక్స్ తో. అలా ప్రజల నడ్డి విరుస్తున్న సర్కారు పాకిస్థాన్ ది.
ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో అతలాకుతలమై కరెంటు బిల్లుల్ని ఎడాపెడా పెంచేసిన సర్కారు.. నిత్యావసరాలతోపాటు పెట్రోలు, డీజిల్ ధరల్ని ఇష్టమొచ్చినట్లు మార్చేసింది. దీంతో ఖైబర్ పంఖ్తుంఖ్వాతోపాటు POK(పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్)లో ఉద్యమాలు మొదలయ్యాయి. వియత్నాం, నైజీరియా వంటి దేశాల కన్నా దారుణంగా మారిపోయింది పాక్ పరిస్థితి.
అలాంటి దేశంలో ఇప్పుడు పాల రేట్లు ఒకేసారి 20% పెరిగాయి. కేవలం పాలపైనే 18% టాక్స్ పెరిగి జనం మొత్తుకుంటున్నారు. 1.33 డాలర్లకు పాకిస్థాన్ కరెన్సీ రూ.370 అవుతున్నది. కరాచీలో పాల ప్యాకెట్ 1.33 డాలర్లు కాగా.. ఆమ్స్టర్ డ్యామ్ లో $1.29, పారిస్ లో $1.23, మెల్ బోర్న్ లో $1.08గా ఉంది.
ఉగ్రవాదం వంటి కారణాలతో IMF(ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నిధులు) ఆగిపోయిన తర్వాత దాయాది దేశంలో 40% మేర టాక్స్ లు పెరిగాయి. అక్కడ ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 60% మంది అనీమియా(Anemia)తో, 40% మంది ఎదుగుదల లోపించి బతుకుతున్నారు.