అధికారిక రహస్యాలు బయటకు వెల్లడించారన్న కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు జైలు శిక్ష పడింది. ఆయనకు పదేళ్ల కారాగార వాసం విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో అప్పటి విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరినీ ముందస్తు అరెస్టు చేయకుండా గత డిసెంబరులో పాక్ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్(Post-Arrest Bail) మంజూరు చేసింది. గత రెండేళ్ల కాలంగా ఈ వెటరన్ క్రికెటర్ అయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై.. తీవ్రస్థాయిలో విచారణలు జరుగుతున్నాయి.
Published 30 Jan 2024