చైనా, పాకిస్థాన్ సరిహద్దు(Borders)ల్లో మరింత అప్రమత్తత కోసం అధునాతన(Modern) ఆయుధాలు సమకూర్చుకోవాలని భావిస్తున్న భారత్.. అమెరికాతో కీలక ఒప్పందాన్ని చేసుకోబోతున్నది. 500 మీటర్ల రేంజ్ లో ప్రత్యర్థిని మట్టుపెట్టగలిగే SIG-716 సాయెర్ అసాల్ట్ రైఫిల్స్ ను కొనుగోలు చేయనుంది. మొత్తం 72,400 ఆయుధాల కోసం రూ.837 కోట్లు వెచ్చించనుంది.
రష్యా నుంచి రావాల్సిన AK-203 కలష్నికోవ్ రైఫిల్స్ ఆలస్యం కావడంతో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 66,400 గన్స్ ఆర్మీకి, 4,000 ఎయిర్ ఫోర్స్ కు, మరో 2,000 నేవీకి అప్పగిస్తారు. ఈ ఒప్పందాన్ని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) గత డిసెంబరులోనే ఆమోదించింది. 40,949 లైట్ మెషిన్ గన్లకు గాను 2023 ఆగస్టులో రూ.2,165 కోట్లను ఖరారు చేసింది.
రష్యా-భారత్ సంయుక్త భాగస్వామ్యంలో AK-203 రైఫిల్స్ ను.. ఉత్తరప్రదేశ్ అమేఠీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేయాల్సి ఉంది. దీనిపై 2018లోనే ఒప్పందం కుదిరినా.. ధరలు, రాయల్టీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు.