క్షిపణుల(Missiles)తో భారత్ పై దాడికి దిగిన పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను సర్వనాశనం చేసింది భారత సైన్యం. భారత సరిహద్దులపై దాడులకు దిగుతున్న దాయాది దేశానికి గట్టి బుద్ధి చెబుతూ ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి, సియాల్ కోట్ సహా ప్రధాన నగరాలపైకి మిసైళ్లు దూసుకెళ్లాయి. చైనా నుంచి తెచ్చుకున్న HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్వం చేస్తూ.. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాకిస్థాన్ మిసైళ్లను కూల్చివేసింది. లాహోర్ ను ఖాళీ చేయాలని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది.