యుద్ధం(War)తోనే కాదు.. ప్రత్యర్థిని పరోక్షంగానూ దెబ్బకొట్టొచ్చని నిరూపించింది భారత్. పహల్గామ్ దాడి తర్వాత దాయాదిని కోలుకోకుండా చేస్తున్న కేంద్రం.. తాజాగా ఆ దేశ దిగుమతుల్ని రద్దు చేసింది. ఇక నుంచి పాకిస్థాన్ ద్వారా వచ్చే అన్ని మార్గాలను మూసివేసింది. అక్కణ్నుంచి ఫార్మా ఉత్పత్తులు, పండ్లు(Fruits), నూనెగింజలు దిగుమతవుతున్నాయి. వీటిని తక్షణమే నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. 2019 పుల్వామా దాడి తర్వాత పాక్ వస్తువులపై 200% సుంకాలు అమలవుతుండగా, ఇప్పుడు ఏకంగా దిగుమతుల్నే ఆపేయడం ఆ దేశానికి పెద్ద దెబ్బ. ఈ టారిఫ్స్ తో గతేడాది మన నిధులు అక్కడకు వెళ్లకుండా భారీగా నిలిచిపోయాయి. సింధు జలాల్ని ఆపేయడం, గగనతలాన్ని మూసేయడంతోపాటు పాటు ఈరోజు నుంచి సముద్ర రవాణా మార్గాల్ని నిలిపివేసింది.