ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ(Modi).. ఆ దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్(Jinping)తో కీలక ఒప్పందాలపై చర్చించారు. సరిహద్దు భద్రత, కైలాస మానస సరోవర్ యాత్ర, ప్రపంచంపై ఇరుదేశాల ప్రభావంపై మాట్లాడారు. బోర్డర్ సెక్యూరిటీ నిర్వహణకు ప్రత్యేక ప్రతినిధులు ఉండాలన్న అంగీకారానికి వచ్చారు. గల్వాన్ లోయలో ఘర్షణలతో ఇరుదేశాలకు ప్రాణనష్టం జరిగి దూరం పెరిగింది. ఇక అలా జరగకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు. అపూర్వ స్వాగతంపై మోదీ… ప్రధాని రాక పట్ల జిన్ పింగ్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజ్ స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బెలారస్ సభ్య దేశాలు కాగా.. మరో 16 దేశాలు పాలుపంచుకుంటున్నాయి.