భారతదేశం మరో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న జపాన్(Japan)ను వెనక్కు నెట్టి 4 ట్రిలియన్ డాలర్ల GDPని సాధించిందని నీతిఆయోగ్(NITI Aayog) సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం ప్రకటించారు. జపాన్ ను దాటుతుందని మే 5న IMF ప్రకటించిన 20 రోజులకు నిజంగానే అది సాకారమైంది. 2024 వరకు భారత్ ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. IMF అంచనాల ప్రకారం 2028 నాటికి మన GDP 5,584 బి.డాలర్లు కానుండగా, జర్మనీ GDP 5,251 బి.డాలర్లవుతుంది. 2027 నాటికే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. తొలి స్థానంలో 30,507 బి.డా.తో అమెరికా, 19,231 బి.డా.తో చైనా రెండో స్థానంలో ఉన్నాయి. https://justpostnews.com
పూర్తి వివరాల కోసం…: https://justpostnews.com/national/india-to-become-largest-economy/