అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న భారత్-పాక్ చర్చలు ముగిశాయి. ఇరుదేశాల DGMOలు హాట్ లైన్ ద్వారా చర్చించుకున్నారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇవి ముగియడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల సారాంశం మరికొద్దిసేపట్లో బయటకు రానుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)తోపాటు ఉగ్రవాదులను అప్పగించడం తప్ప వేరే అంశం లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. అయితే ఈ చర్చల్లో ఇవే అంశాలున్నాయా, లేక ఇంకేమైనా మాట్లాడారా అన్నది కాసేపట్లో రక్షణ శాఖాధికారులు ప్రకటిస్తారు. ఈ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే అంటే రాత్రి 8 గంటలకు దేశాన్నుద్దేశించి ప్రధాని మాట్లాడనుండటంతో ఏం జరగబోతుందనే విషయంలో మరికొద్ది సేపు సస్పెన్స్ కొనసాగనుంది.