విదేశాల్లోని భారతీయులు పంపిన ధనం వరుసగా మూడో ఏడాది రికార్డుగా నిలిచింది. 2024లో 129.4 బిలియన్ డాలర్లు(రూ.11 లక్షల కోట్లు) వచ్చినట్లు RBI తెలిపింది. 100 బిలియన్లు దాటడం వరుసగా ఇది మూడో ఏడాది. 1990లో IT రంగం ఉద్భవించాక గత 25 ఏళ్ల కాలంగా భారత్ ప్రపంచంలో దూసుకుపోతోంది. విదేశీ ధనంలో 2008లో అగ్రస్థానం దక్కించుకున్న భారతీయులు.. ఇప్పటివరకు మరే దేశానికి చోటివ్వలేదు. స్కిల్డ్ ప్రొఫెషనల్స్ సహా అత్యుత్తమ సర్వీసుల్ని ఉత్తర అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు విస్తరించడంతో ఈ ఘనత సాధ్యమైంది. 1990లో 66 లక్షల మంది వలస వెళ్తే, 2024లో అది 1.85 కోట్లకు చేరుకుంది. 68 బి.డా.తో మెక్సికో, 48 బి.డా.తో చైనా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. https://justpostnews.com