అమెరికా వర్జీనియా(Virginia) స్టోర్ లో జరిగిన కాల్పుల్లో భారత్ కు చెందిన ప్రదీప్ పటేల్(56), ఆయన కూతురు ఉర్మి(24) ప్రాణాలు కోల్పోయారు. మద్యం కోసం స్టోర్లోకి వెళ్లిన జార్జ్ వార్టన్(44).. రాత్రిపూట ఎందుకు మూసేస్తున్నారంటూ వాదనకు దిగాడు. కోపంతో గన్ తో కాల్చడంతో ప్రదీప్ అక్కడికక్కడే కన్నుమూశారు. తీవ్రంగా గాయపడ్డ ఉర్మిని ఆస్పత్రి తరలించినా ప్రాణాలు దక్కలేదు. గుజరాత్ మెహ్సనా(Mehsana) జిల్లా కనోడా గ్రామానికి చెందిన ప్రదీప్.. భార్య, కూతురుతో కలిసి ఆరేళ్ల క్రితం US వెళ్లారు. బంధువైన పరేశ్ పటేల్ స్టోర్ లో పనిచేస్తున్నారు. ప్రదీప్ కు ముగ్గురు కూతుళ్లు కాగా.. ఒకరు కెనడాలో, మరొకరు అహ్మదాబాద్ లో ఉంటున్నారు. వరుస హత్యలు అమెరికాలోని భారతీయుల్ని భయపెడుతున్నాయి . కొన్ని నెలల క్రితమే నార్త్ కరోలినా స్టోర్ లో జరిగిన కాల్పుల్లో మెయినంక్ పటేల్(36) మరణించారు.