పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసి వెళ్లగొట్టింది అమెరికా. కొలంబియా(Columbia) వర్సిటీ స్టూడెంట్ రంజని శ్రీనివాసన్.. తీవ్రవాద సంస్థ హమాస్ కు మద్దతిచ్చే కార్యకలాపాల్లో పాల్గొందని US హోంల్యాండ్ సెక్యూరిటీ గుర్తించింది. ఈనెల 5న ఆమె వీసా రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించింది. ‘హింస, ఉగ్రవాదాన్ని సమర్థించే వారెవరూ తమ దేశంలో ఉండకూడదు.. USలో చదువు, నివాసానికి వీసా ఇస్తున్నాం.. హింస, టెర్రరిజం కోసం వాదిస్తే ఆ ప్రత్యేక హక్కు రద్దవుతుంది..’ అంటూ అగ్రరాజ్యం స్పష్టం చేసింది.