
సెకనుకు 61 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న తోకచుక్కను నాసా అబ్జర్వేటరీ గుర్తించింది. సూర్యుడికి దగ్గరైనపుడు వేగం మరింత పెరిగి సెకనుకు 68.3 సెకన్లుగా ఉందని తేల్చింది. దీనికి ‘త్రీఐ అట్లాస్’ అని పేరు పెట్టింది. గతంలోనూ రెండింటిని గుర్తించినా, వాటితో పోలిస్తే ‘త్రీఐ అట్లాస్’ వ్యవహారం కొంచెం తేడాగా ఉంది. సుదూర విశ్వం నుంచి ఓ భారీ ఆకారం వేగంగా ప్రయాణిస్తుండటంతో ఇది గ్రహాంతరవాసుల నౌకనా అన్న మిస్టరీ కనిపిస్తోంది. ఇది సూర్యుడి వెనుక దాగి ఉన్నప్పుడు వేగంగా, ఊహించని విధంగా ప్రకాశిస్తూ నీలిరంగుకు మారపోవచ్చని గుర్తించారు.
ఇది అత్యంత పురాతనమైందని, 7 బిలియన్ సంవత్సరాల క్రితం పాలపుంత సరిహద్దులో దాని స్వస్థలమైన నక్షత్రం నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబరు ప్రారంభంలో అంగారక గ్రహానికి దగ్గరగా వచ్చిన తర్వాత కొన్ని వారాలుగా భూమికి అటు సూర్యునిగా ఎదురు దిశలో ఉంది. కాబట్టే మన గ్రహం నుంచి దాన్ని ఎక్కువగా పరిశీలించే అవకాశం లేకుండా పోయిందన్నది శాస్త్రవేత్తల మాట.