ఇజ్రాయెల్(Israel)కు అమెరికా తోడై తమపై వరుసగా దాడులు చేస్తున్న వేళ.. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్(Hormuz) జలసంధిని మూసివేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇదే జరిగితే ప్రపంచంలో 20% చమురు రవాణా నిలిచిపోతుంది. అయితే ఈ నిర్ణయంపై పునఃసమీక్షించే ఆలోచన కూడా ఉందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇస్మాయిల్ కొసారి తెలిపారు. అరేబియా సముద్రంలో నౌకల కోసం 2 కి.మీ. మాత్రమే నావిగేషన్ ఛానల్ ఉండే ఇరుకైన జలసంధి.. నౌకలతో అత్యంత రద్దీగా ఉంటుంది. ఇది మూసేస్తే రవాణా తగ్గి పెట్రోలు, డీజిల్, ఎల్ఎన్జీ(LNG) ధరలు పెరుగుతాయి. హార్మూజ్ జలసంధి మూసేస్తే పెను ప్రమాదం… లింక్ క్లిక్ చేసి చదవండి… https://justpostnews.com/international/if-hormuz-strait-close/