వారిద్దరికీ త్వరలోనే ఎంగేజ్మెంట్. ప్రియురాలి చేతికి తొడిగేందుకు మొన్ననే ఉంగరం(Ring) కూడా కొన్నారు. కానీ ఇంతలోనే ఉగ్రవాదుల కాల్పులు ఆ యువ జంటను బలితీసుకున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్(Washington)లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో యరాన్-సారా అనే దౌత్య జంట ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటర్ ప్రకటించారు. జెరూసలెంలో ఉంగరాలు మార్చుకునే టైం దగ్గర పడుతున్న వేళ.. ఇద్దరూ మృతిచెందారు. యరాన్-సారా స్నేహితులు కాగా.. ఒకేచోట చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నారు. చికాగోకు చెందిన ఇలియాస్ రోడ్రిగ్జ్ అనే దుండగుణ్ని పోలీసులు పట్టుకున్నారు.