భారత్ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu). తామిచ్చిన ఆయుధాల్ని ‘ఆపరేషన్ సిందూర్’లో వాడితే అద్భుతంగా పనిచేశాయన్నారు. భారత్ పై 50% సుంకాలు ట్రంప్ విధించడంతో.. ఈ రెండు దేశాల మైత్రికి మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు. మోదీ, ట్రంప్ తనకు అద్భుత మిత్రులని.. భారత ప్రధాని అడిగితే కాదనేది లేదన్నారు. త్వరలోనే భారతదేశానికి వస్తానన్న నెతన్యాహు.. టెల్ అవీవ్(Tel Aviv)-బెంగళూరు మధ్య నేరుగా విమానాల్ని ప్రారంభించాలని ఉందన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం 6 గంటలు తగ్గుతుంది.