ఆపరేషన్ సిందూర్(Sindoor)తో భారత్ జరిపిన దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్.. అయినవాళ్లందర్నీ కోల్పోయాడు. ఈనెల 7 నాటి దాడుల్లో అతడి కుటుంబంలో 10 మంది హతమయ్యారు. ఆరోజు మట్టుబెట్టిన ఐదుగురి వివరాల్ని సైన్యం ప్రకటించింది. మసూద్ బావమరుదులు హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసుఫ్ అజహర్ హతమయ్యారు. ఇదే దాడిలో లష్కర్ తొయిబాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ముదస్సర్ ఖదాయిన్ ఖాస్, ఖలీద్.. జైషే మహ్మద్ మరో లీడర్ మహ్మద్ హసన్ ఖాన్ ను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రనేత ముదస్సర్ అంత్యక్రియల్ని పాకిస్థాన్ అధికారికంగా నిర్వహించడాన్ని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆర్మీ చీఫ్, పాక్ లోని పంజాబ్ CM హాజరవడం ఆ దేశ ప్రభుత్వం తీరును చాటిచెప్పింది.