పరస్పర గౌరవం నెలకొన్నప్పుడే రెండు దేశాల మధ్య సహకారం ఉంటుందని.. ఉగ్రవాదం, అతివాదం(Extremism), వేర్పాటువాదం(Separatism) అనే మూడు భూతాల్ని(Evils) విడిచిపెడితేనే భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయంటూ పాకిస్థాన్లో నిర్వహిస్తున్న షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సులో జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తొమ్మిదేళ్ల విరామం తర్వాత దాయాది దేశంలో అడుగుపెట్టిన విదేశాంగమంత్రి జైశంకర్. 2015లో సుష్మాస్వరాజ్ పాక్ లో పర్యటించగా.. అప్పట్నుంచి ఇప్పటివరకు సంబంధాలు లేకుండా పోయాయి. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు కొనసాగినంతకాలం వ్యాపార సంబంధాలు మెరుగుపడవంటూ జైశంకర్ స్పష్టం చేశారు.