
జోర్డాన్ యువరాణి సర్వత్ ఇక్రముల్లాకు భారత్ తో అనుబంధముంది. దేశ విభజనకు కొన్ని వారాల ముందు ప్రముఖ బెంగాలీ ముస్లిం వంశమైన సుహ్రావర్ది కుటుంబంలో 1947లో కలకత్తాలో జన్మించారు.
ఆమె తండ్రి మహ్మద్ ఇక్రముల్లా ఇండియన్ సివిల్ సర్వీస్ లో భాగంగా పాకిస్థాన్ మొదటి విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. తల్లి షయిస్తా పాక్ మొదటి పార్లమెంటేరియన్లలో ఒకరు కాగా మొరాకో రాయబారిగా బాధ్యతలు నిర్వర్తించారు. బ్రిటన్లో చదివి తండ్రి ఉద్యోగరీత్యా యూరప్, దక్షిణాసియా తిరిగారు. జోర్డాన్ ప్రిన్స్ హసన్ బిన్ తలాల్ తో బ్రిటన్ లో కలిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. భారత్ లో పుట్టి, పాక్ లో పెళ్లి చేసుకున్నారామె. తర్వాత జోర్డాన్ లో స్థిరపడగా, ఈ జంటకు నలుగురు పిల్లలు. యువరాణులు రెహమా, సుమయా, బడియా, ప్రిన్స్ రషీద్ ఉన్నారు. 1968 నుంచి 1999 వరకు జోర్డాన్ ప్రిన్సెస్ గా పనిచేశారు.
తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి జోర్డాన్ మహిళగా, బ్యాడ్మింటన్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షురాలిగా సర్వత్ పనిచేశారు. 1999లో తన కుమారుడు ప్రిన్స్ అబ్దుల్లాను రాజు వారసుడిగా ప్రకటించడంతో యువరాణి పదవీకాలం ముగిసింది.