పాకిస్థాన్, ఆక్రమిత కశ్మీర్లో(POK) జరిపిన దాడులపై సైన్యం వివరాలు వెల్లడించింది. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాల్ని(Shelters) గుర్తించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణశాఖ ప్రతినిధి సోఫియా ఖురేషీ తెలిపారు. గుర్తించిన 21 స్థావరాల్లో తొమ్మిదింటిపై సైన్యం దాడులు చేసింది. సియాల్ కోట్ లోని మహమూనా జోయా క్యాంప్.. హిజ్బుల్ ముజాహిదీన్ కు అతిపెద్ద కేంద్రం. సరిహద్దుకు 12 కిలోమీటర్ల దూరంలోని ఈ క్యాంప్ పై ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. బోర్డర్ కు 25 కిలోమీటర్ల దూరంలోని మర్కత్ మురీద్కే క్యాంప్ పైనా సైన్యం దాడికి దిగింది. 2008 ముంబయి దాడులకు ప్లాన్ ఇక్కడే వేశారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ.. మురీద్కే క్యాంపులోనే ట్రెయినింగ్ పొందినట్లు సైన్యం ప్రకటించింది.