వరుసగా వస్తున్న భూకంపాలతో దేశాలు గడగడలాడుతున్నాయి. రష్యాలో గత ఏడు గంటల్లో 64 భూకంపాలు(Earthquakes) వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్రత రిక్టర్ స్కేలుపై గరిష్ఠంగా 8.8 కాగా, మిగతావి 5గా రికార్డయ్యాయి. భారీ సునామీతో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం ఏర్పడింది. రష్యా(Russia), జపాన్, అమెరికా, న్యూజిలాండ్ ఇలా.. సముద్ర తీర దీవులన్నీ అల్లకల్లోలమయ్యాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో సాగర అలలు 12 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయి.