పశ్చిమాసియా(Mideast)లో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ పై లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా 320 రాకెట్లు ప్రయోగించడంతో రెండు దేశాల మధ్య పోరు(Fight) తీవ్రస్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) లక్ష్యంగా 320 కత్యూష రాకెట్లను హెజ్బొల్లా ప్రయోగించింది. దీనిపై నెతన్యాహూ సేన ప్రత్యర్థిపై ఎదురుదాడి స్టార్ట్ చేసింది.
హెజ్బొల్లా కమాండర్ ఫౌద్ షుక్ర్ ను గత నెలలో ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. తమ ఐరన్ డ్రోమ్ లు, రక్షణ కేంద్రాలే లక్ష్యంగా సాగిన దాడులతో 48 గంటల పాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు ప్రధాని నెతన్యాహూ. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్(IAF) రంగంలోకి దిగి హెజ్బొల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పై ప్రతిదాడి చేస్తుండగా.. అమెరికా మద్దతు ప్రకటించింది.