ఆపరేషన్ సింధూర్(Sindoor)తో భారత్ జరిపిన దాడుల్లో ఉగ్ర సంస్థ(Terrorist Group) చీఫ్ కుటుంబమంతా హతమైంది. బహవల్ పూర్ క్యాంపుపై జరిపిన దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందారు. అయితే అతడు అక్కడ లేకపోవడంతో తప్పించుకున్నాడు. అజహర్ భార్య, అక్క, బావ, మేనల్లుడు హతమవగా, అదే సంస్థకు చెందిన హెడ్ క్వార్టర్స్ సర్వనాశనమైంది. సంస్థకు చెందిన మరో నలుగురు సభ్యులతోపాటు మొత్తంగా 14 మంది హతమయ్యారు.
జైషే సంస్థను మసూద్ స్థాపించగా, 2001లో పార్లమెంటు దాడి సూత్రధారి అతడే. 1999లో విమానం హైజాక్ తర్వాత భారత ప్రభుత్వం అతణ్ని జైలు నుంచి విడుదల చేసింది. 2016 పఠాన్ కోట్, 2019 పుల్వామా దాడులతోనూ జైషే మహ్మద్ సంస్థకు సంబంధముంది. తన కుటుంబం హతమవడాన్ని స్వయంగా జైషే చీఫ్ ప్రకటించగా, అందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్నాడు.