
రష్యాలోని షాపింగ్ మాల్ లో వేడి నీళ్ల పైపు పగిలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 70 మందికి గాయాలయ్యాయి. వెస్ట్ మాస్కోలోని షాపింగ్ మాల్ లో ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల్ని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే అమ్మోనియా లీక్ అయిందన్న వార్తల్ని అక్కడి అధికారులు కొట్టిపడేశారు. ‘రెమెన గోడా’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ మాల్ 150 స్టోర్లతో 2007లో ప్రారంభమైంది. స్థానిక భాషలో రెమెన గోడా అంటే నాలుగు సీజన్లు(Four seasons) అని అర్థం.
వేడినీళ్ల ప్రవాహానికి తలుపులు కొట్టుకుపోగా.. ఫ్లోర్లు మొత్తం నీటితో నిండిపోయాయి. అందులో ఉన్నవాళ్లలో చాలా మంది సురక్షితంగా బయటపడగా.. నలుగురు వ్యక్తులు మాత్రం దుర్మరణం పాలయ్యారు.