మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 09 Jan 2024
ప్రశాంతతకు మారుపేరైన మాల్దీవుల్లో చెలరేగిన మంటలు ఎంతకూ చల్లారడం లేదు. చివరకు అక్కడి ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అసలు మాల్దీవులకు, లక్ష్యద్వీప్ కు గల తేడా ఏంటి..? ఈ రెండు ద్వీప దేశాల్లో టూరిజానికి ఏది బెటర్..? అన్న విషయాల్ని చర్చించాలి. మోదీని విమర్శించడమే ఆ దేశం చేసిన పెద్ద పొరపాటుగా మిగిలిపోతున్నది. దశాబ్దాల నుంచి తమకు పెద్దన్నగా ఉన్న భారత్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మాల్దీవులను అతలాకుతలం చేస్తున్నది. టూరిజంలో భారత్ అపరిశుభ్రం(Cleanless) అని, ఆ దేశం తమతో ఎప్పటికీ పోటీ పడలేదంటూ ముగ్గురు మంత్రులు నోరు పారేసుకున్నారు. దీనిపై మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా అక్కడి ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి(No-Confidence Motion) రెడీ అయ్యాయి విపక్షాలు.
లక్ష్యద్వీప్-మాల్దీవుల మధ్య డిఫరెన్స్…
మాల్దీవులకు టూరిజమే ప్రధానాధారం. ఏటా దీని ద్వారానే అక్కడి బడ్జెట్ పట్టాలకెక్కుతుంది. అయితే మాల్దీవులు-లక్ష్యద్వీప్ కు సారూప్యతలున్నాయి. కేవలం 4 లక్షల జనాభా కలిగిన మాల్దీవులు 1,200 ద్వీపాలు కలిగిన దేశమైతే.. చాలా ఐలాండ్స్ లో జనాలు ఉండరు. లక్ష్యద్వీప్ కు వెళ్లిరావడం కంటే మాల్దీవులకు వెళ్లడమే ఈజీ. కేరళలోని కొచ్చికి 1,000 కిలోమీటర్ల దూరంలోని మాల్దీవులకు వెళ్లేందుకు మన దేశం నుంచి భారీగా విమానాలు అందుబాటులో ఉండగా.. లక్ష్యద్వీప్ కు ఆ సౌకర్యం లేదు. లక్ష్యద్వీప్ 36 ద్వీపాల సముదాయమే కాబట్టి ఇప్పటిదాకా అది జనం కంట పడలేదు. మోదీ అడుగుపెట్టాకే లక్ష్యద్వీప్ అందాల గురించి ప్రపంచానికి తెలిసింది. 1965లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత మాల్దీవులు.. 1968లో రాచరికం నుంచి రిపబ్లిక్ గా మారింది. ఆ దేశానికి అతి పెద్ద ఆదాయ వనరు భారత టూరిస్టులు.
మన దేశ టూరిస్టులు ఎంతంటే…
మన దేశం నుంచి 2011లో 1.4 కోట్ల మంది టూరిస్టులు విదేశాలకు వెళ్తే 2019 నాటికి అది 2.7 కోట్లకు చేరుకుంది. కొవిడ్ వల్ల రెండేళ్లపాటు పర్యాటకం నిలిచిపోగా, మళ్లీ 2022లో 2.1 కోట్ల మంది ఫారిన్ ట్రిప్ వేశారు. 2022లో UAE(దుబాయి)కి 28%తో 59 లక్షల మంది, సౌదీ అరేబియాకు 11.5%తో 24 లక్షలు, అమెరికాకు 8%తో 17 లక్షలు, సింగపూర్ కు 4.7%తో 9.9 లక్షలు, థాయిలాండ్ కు 4.4%తో 9.3 లక్షలు, ఇంగ్లండ్ కు 4.3%తో 9.2 లక్షలు, ఖతార్ కు 4.1%తో 8.7 లక్షలు, కువైట్ కు 3.9%తో 8.3 లక్షలు, కెనడాకు 3.6%తో 7.7 లక్షలు, ఒమన్ కు 3.4%తో 7.2 లక్షల మంది వెళ్లారు. మరి ఈ లిస్టులో మాల్దీవులు లేదనుకుంటున్నారా.. అవును నిజంగానే ఇందులో లేదు. ఎందుకంటే 2022లో ఆ దేశానికి వెళ్లిన సంఖ్య 2.5 లక్షలు. 2023లో ఇది 2 లక్షలు. మనకు ఇది అతి తక్కువ కాగా… మాల్దీవులకు మాత్రం ఇదే అతిపెద్ద సంఖ్య. ఎందుకంటే ఆ దేశానికి వచ్చేవారిలో భారతీయులే ఎక్కువ.
భారతీయులకు ప్రత్యేకం…
మారిషస్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, ఒమన్, హాంకాంగ్, కజకిస్థాన్, బార్బడోస్, సెర్బియా, ఖతార్, ఇరాన్.. ఇలా మొత్తం 11 దేశాలు వీసా-ఫ్రీ అవకాశాన్ని కల్పించాయి. ఇక ఇండొనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, జోర్డాన్, వియత్నాం, టర్కీ, అజర్ బైజాన్, శ్రీలంక, న్యూజిలాండ్, కంబోడియా, మయన్మార్ దేశాలు వీసా రూల్స్ ని సడలించాయి. ఇలా మొత్తం 23 దేశాలు వీసా లేకుండానే భారతీయుల్ని ఆహ్వానిస్తున్నాయి. ‘తన చేష్టలే తనకు ప్రమాదం’ అన్నట్లుగా చైనాకు అనుకూల, భారత్ ప్రతికూల వాదిగా ముద్రపడ్డ అధ్యక్షుడు మయిజ్జు.. చివరకు మన దేశం వల్లే పదవీచ్యుతుడు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా పర్యటనలో ఉన్న ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అక్కడి పార్లమెంటరీ మైనార్టీ లీడర్ అలీ అజీమ్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా అక్కరకు రాని మాటలు మాట్లాడటం కేవలం వ్యక్తులకే కాదు.. దేశాలకూ వర్తిస్తుందని మాల్దీవుల సిట్యుయేషన్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.