మరోసారి భారీ భూకంపం(Earth Quake) సంభవించింది. రష్యా కమ్చట్కాలో ప్రకంపనలు వచ్చాయి. ఈ రెండు నెలల కాలంలో వచ్చిన రెండో అతిపెద్ద భూకంపమిది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. 2025 జులైలోనూ 8.8 తీవ్రతతో వచ్చి రష్యా సహా చాలా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. గత 14 ఏళ్లలో ఆరో అతిపెద్దది ఇది. 2011లో జపాన్ లో 9.1తో వచ్చిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. రష్యాలోని కమ్చట్కా పెనిన్సులా ప్రాంతంలో 1952లో 9 తీవ్రతతో రాగా.. తరచూ భూకంపాలు వస్తుంటాయక్కడ.