హిందూ మహిళపై అత్యాచారం(Rape) జరగడంతో బంగ్లాదేశ్ లో ఆందోళనలు జరిగాయి. కమిల్లా(Cumilla)లో 21 ఏళ్ల మహిళపై అక్కడి రాజకీయ నాయకుడు అఘాయిత్యం చేశాడు. ఆమె నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢాకా యూనివర్సిటీ నుంచి హిందూ వర్గాల నిరసనలు మొదలయ్యాయి. ఆ లీడర్ ఫరోజ్ అలీ(36)తోపాటు వీడియోలు ఇంటర్నెట్లో పెట్టిన మరో నలుగుర్ని అరెస్టు చేశారు. భర్తతో దుబాయిలో ఉంటున్న బాధిత మహిళ.. స్థానిక పండుగ ‘హరి సేవ’ కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఆమెపై అత్యాచారం చేసిన అలీని చితకబాదిన స్థానికులు.. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే నిందితుడు పారిపోయాడు. ఆమెకు భద్రత కల్పించాలని బంగ్లా హైకోర్టు ఆదేశించింది.