ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాలో అంతర్యుద్ధం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి మిలిటరీకి సపోర్ట్ గా ఉన్న వాగ్నర్ గ్రూప్ ప్లేటు ఫిరాయించింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలగొడతామని ప్రతిన బూనింది. మిలిటరీ లీడర్ షిప్ లక్ష్యంగా అక్కడి సేనలు పనిచేస్తున్నాయని ఇంటర్నేషనల్ మీడియా అంటోంది. ఉక్రెయిన్ లోని తాజా పరిస్థితులపై ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూప్ తీవ్ర అసంతృప్తితో ఉంది. మా దళాలు రష్యాలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని, రష్యన్లు ఎవరూ అడ్డుగా రావొద్దని, తమ గ్రూపులో చేరాలని ఆ గ్రూప్ చీఫ్ పిలుపునిస్తున్నారు. యుద్ధం మాటున రష్యా.. రక్షణ దళంలోని సిబ్బందిని పెద్దసంఖ్యలో హతమార్చిందని తెలిపింది.
రష్యా అలర్ట్…
ఈ ఇష్యూతో అలర్ట్ అయిన రష్యా… దేశంలోని మెయిన్ సిటీల్లో సెక్యూరిటీని భారీగా పెంచింది. అటు వాగ్నర్ గ్రూప్ చీఫ్ పై రష్యాలో క్రిమినల్ కేసు నమోదైంది. వాగ్నర్ గ్రూప్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని పుతిన్ సేన హెచ్చరించింది.